Tuesday, 28 October 2014

అల్లు అర్జున్ తో లెజెండ్ దర్శకుడు.

                                      


ఇటివలే బాలకృష్ణ తో లెజెండ్ వంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు  బోయపాటి శ్రీను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే బోయపాటి కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దాంతో ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో కానీ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నదని ఫిలిం నగర్ సమాచారం. అల్లు అరవింద్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. కొన్ని రోజుల క్రితం దర్శకుడు బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆర్ధిక సమస్యల వలన ఆ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తుంది.  దాంతో ప్రస్తుతం అల్లు అర్జున్ కి వినిపించిన కథని లైన్లో పేటె పనిలో ఉన్నాడట బోయపాటి. ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించనున్నట్లు సమాచారం. అప్పట్లో భద్ర సినిమా కథని మొదట అల్లు అర్జున్ కి బోయపాటి చెప్పాడు. అయితే అది తనకు సరైనది కాదని వదులుకోవడంతో రవితేజ ఆ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.

No comments:

Post a Comment