ఎప్పుడైతే భారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందే బాహుబలి సినిమా షూటింగ్ మొదలైందో, అప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటూ వచ్చాడు ప్రభాస్. ఒకటి రెండు సినీ ఫంక్షన్లలో తప్ప బయట కనిపించింది చాలా తక్కువే. అందుకే ప్రభాస్ నుంచి బాహుబలి విషయాలేం బయటకు రాలేదు. ఎట్టకేలకు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా మీడియాకు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే ఇక్కడ కూడా బాహుబలి విషయాలు పెద్దగా చెప్పలేదు. కానీ కొన్ని హింట్లుమాత్రం ఇచ్చాడు. బాహుబలి విజువల్‌గా ఇండియాలోనే నెంబర్ వన్ సినిమా అవుతుందని ప్రభాస్ భరోసా ఇస్తున్నాడు. ఇంత గొప్ప సినిమా ఇంత త్వరగా చేస్తాననుకోలేదు. లైఫ్‌లో ఇలాంటి అవకాశం ఒక్కసారే వస్తుంది. జీవితంలో మరపురాని సంఘటన ఒక్కటే ఉంటుంది. అది నా దృష్టిలో బాహుబలి. అని బాహుబలి గుట్టు విప్పాడు ప్రభాస్. ఈ సినిమాలో దాదాపు 5 పాత్రలు హైలెట్‌గా ఉంటాయట. రాజమౌళి సినిమాల్లో కథంతా హీరో చుట్టూ తిరుగుతుంది. కానీ ఈ సినిమాలో మాత్రం కనీసం 5 పాత్రల్ని ప్రేక్షకులు ఇష్టపడడం మొదలెడతారు అన్నాడు ప్రభాస్. అంతే కాదు రానా పాత్ర అందరిని మెప్పిస్తుంది అని చెబుతున్నాడు . మరి ప్రభాస్ ఇలా చెప్పడం తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి మరి.
Tuesday, 28 October 2014
బాహుబలి గురించి ప్రభాస్.........

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment