Thursday, 30 October 2014

శ్రీను వైట్లకు ఓకే చెప్పిన చరణ్.

                                    


గోవిందుడు అందరి వాడెలే తరువాత రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ఇంకా కన్ఫర్మ్ కాలేదు . అయితే రామ్‌చ‌ర‌ణ్  శ్రీ‌నువైట్ల  కాంబినేష‌న్ లో ఓ  సినిమా త్వ‌ర‌లోనే  ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే శ్రీను వైట్ల రామ్ చరణ్ కు కథ చెప్పిన విషయం తెలిసిందే . ఇప్పుడు ఆ క‌థ‌లోనే కొన్ని మార్పులు చేసి స్ర్కిప్టు ను  చ‌ర‌ణ్‌, చిరుల‌కు వైట్ల వినిపించాడ‌ని, మార్పులు చేసిన త‌ర‌వాత క‌థ బాగా వ‌చ్చింద‌ని, అందుకే చ‌ర‌ణ్ కూడా ఓకే అన్నాడ‌ని తెలుస్తోంది.  ఇప్పటికే అటు శ్రీను వైట్లకు గాని ఇటు చరణ్ కు వేరే సినిమా కమిట్మెంట్ లు ఏమి లేకపోవడం తో ఈ ప్రాజెక్ట్ కు రెడీ అయినట్టు తెలుస్తోంది . మరి ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

No comments:

Post a Comment