Thursday, 30 October 2014

సుకుమార్ కొత్త సినిమా 9నుండి.

                     


సుప్రసిద్ద దర్శకులు సుకుమార్ నిర్మాతగా మారి తన మిత్రులతో కలిసి ఉయ్యాల జంపాల ఫేం రాజ్ తరుణ్ హీరోగా రూపొందిస్తున్న చిత్రం నవంబర్ 9న ప్రారంభం కానుంది. కరెంట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ ప్రేమ కథా చిత్రం తెరకెక్కనుంది. రాజ్ తరుణ్ సరసన షీనా బజాజ్ నటించబోతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా అగ్రశ్రేణి ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఈ చిత్రానికి పని చేయడం విశేషం. క్యూట్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ తన స్నేహితులైన విజయ్ బండ్రేడ్డి ,థామస్ రెడ్డి ల సహకారం తో నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment