Thursday, 30 October 2014

కత్తి ని పట్టేది లేదన్న పవన్ కళ్యాణ్.


                                  

 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కత్తి ని పట్టుకుంటాడు అని భావించిన వాళ్ళకు ఆ కత్తి ని పట్టేది లేదని ఆ కత్తి ని తిప్పి కొట్టాడని తెలుస్తోంది. ఇంతకీ ఈ కత్తి గోల ఏంటంటే ...... తమిళనాట దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఇళయ దళపతి చిత్రం ''కత్తి '' అక్కడ కత్తిలా దూసుకు పోతోంది. తమిళనాట పాత రికార్డులను బద్దలు కొడుతూ కొత్త రికార్డులను సెట్ చేస్తోంది విజయ్ కత్తి. ఐతే రైతు సమస్యలపై చిత్రీకరించిన ఈ చిత్రం తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయ మని భావించారు. కానీ నిన్న ఈ చిత్రాన్ని చూసిన పవన్ కళ్యాణ్ రీమేక్ చేయడానికి నిరాకరించినట్లు సమాచారం. పవన్ కత్తి పట్టను అని చెప్పడంతో ఇక ఆ చిత్రాన్ని డబ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఠాగూర్ మధు.

No comments:

Post a Comment