టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క తెలుగులో కొత్త సినిమాలు అంగీకరించకపోవడం పలువురిలో అనుమానాలు రేకెత్తిస్తోంది. గత కొన్నాళ్లుగా ఈ భామ 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాలు చేస్తూ బిజీగా వుంది. ఒకరిద్దరు తమ సినిమాలలో అడిగినప్పటికీ ఆమె ఒప్పుకోవడం లేదట. ప్రస్తుతం చేస్తున్న రెండూ పూర్తయ్యాకనే కొత్త సినిమాలు చేస్తానని చెబుతూ వస్తోంది. అయితే, అదే సమయంలో తమిళంలో రజనీకాంత్, అజిత్ సినిమాలలో నటిస్తోంది. మరి కొన్ని తమిళ సినిమాలు కూడా చర్చల దశలో వున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగులో కొత్త సంతకాలు పెట్టకపోవడానికి ప్రధాన కారణం, సీనియర్ హీరోల నుంచి అమ్మడికి ఆఫర్లు లేవట ! యంగ్ హీరోలు ఆమెతో చేయడానికి ఒప్పుకోవడం లేదు. ఎవరో ఒకరిద్దరు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి మాత్రమే ఆమెను సంప్రదిస్తున్నారు. అందుకే, తనకు అవకాశాలు వస్తున్న తమిళ రంగంపైనే దృష్టి పెడుతోందట. కొత్త హీరోయిన్ల రాకతో అనుష్క కెరీర్ తెలుగులో వెనక పడిపోయినట్టే అని తెలుస్తోంది ?
Sunday, 26 October 2014
అనుష్కకు సినిమాలు లేవా?

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment