Tuesday, 28 October 2014

మామధ్య లోకి వస్తే రఫ్ఫాడిస్తాం అంటున్న చరణ్

                               


 బాబాయ్ కి మాకు మద్య పెద్ద గొడవలంటూ ఏమీ లేవని బాబాయ్ జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టినంత మాత్రాన మా కుటుంబం విడిపోదని మా మద్య కు ఎవరైనా వచ్చి మరింతగా రెచ్చగొడితే రఫ్ఫాడిస్తాం అని అంటున్నాడు మెగా హీరో రామ్ చరణ్. ఇటీవల తెలంగాణలో అప్రకటిత  నిషేధానికి గురైన ఓ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న చరణ్ తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉన్న విభేధాల గురించి మాట్లాడాడు. మామధ్య చిన్న అభిప్రాయ బేధాలు తప్ప విభేదాలు లేవని అన్నాడు. అనవసరంగా ఆ విషయాన్నీ పెద్దదిగా చేస్తున్నారని ఆవేదన చెందాడు చరణ్. మేము ఎప్పటికైనా ఒకటేనని మామధ్య కు ఎవరైనా వస్తే నలిగి పోవడం ఖాయమని ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు చరణ్ .

No comments:

Post a Comment