Sunday, 26 October 2014

హీరో విజయ్ విగ్రహం ఆవిష్కరణ.

                   
 


తమిళ సినిమా అభిమానులు తమ హీరోలపై చూపించే అభిమానం అంతాఇంతా కాదు. తాము అమితంగా అభిమానించే నటీనటులకు ఆలయాలు కట్టడం, వారి విగ్రహాలు పెట్టడం వంటివి చేస్తుంటారు. తాజాగా 'ఇళయదళపతి' విజయ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వెట్రీ ధియేటర్ లో హీరో విజయ్ మైనపు విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు.

రూ.1.5 లక్షలతో ఫేస్బుక్ విజయ్ ఫ్యాన్స్ క్లబ్ ఈ విగ్రహాన్ని తయారు చేయించింది. ఈ నెల 22న విడుదలైన విజయ్ 'కత్తి' సినిమా రూ. 30 కోట్లు పైగా ఆరంభ వసూళ్లు రాబట్టింది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ కు జోడీగా సమంత నటించింది. గతంలో విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన తుపాకీ కూడా మంచి విజయాన్ని అందుకుంది.

No comments:

Post a Comment