Thursday, 30 October 2014

న్యూడ్ సినిమాలో నేను నటించట్లేదంటున్న శిల్పి .


                                         



న్యూడ్ సినిమాలో నేను నటించబోతున్నట్లు వార్తలు రావడంతో అవాక్కయ్యానని ఐతే నేను ఆ సినిమాలో నటించడం లేదని పైగా కథ విన్నంత మాత్రాన ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లేనా అని ఎదురు ప్రశ్నిస్తోంది'' గ్రీన్ సిగ్నల్'' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన శిల్పి శర్మ. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ''బోల్డ్ '' కంటెంట్ తో ఓ చిత్ర కథ తయారు చేసుకున్నారు కానీ ఆ చిత్రంలో నటించడానికి రెగ్యులర్ హీరోయిన్ లు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ చిత్ర కథలో ఎక్కువ భాగం న్యూడ్ సీన్లు ఉండటం తో విజయేంద్ర ప్రసాద్ శిల్పి శర్మ ని సంప్రదించారట ! ఆ చిత్ర కథ విని ఆ సినిమాలో న్యూడ్ సీన్లు ఎక్కువగా ఉండటం తో వెనుకడుగు వేసింది ఈ భామ . జరిగింది ఇది కాగా వీళ్ళిద్దరూ కలవడంతో ఆ శృంగార చిత్రంలో నటించడానికి శిల్పి శర్మ ఒప్పుకుంది అన్నట్లుగా వార్తలు రావడంతో ఖంగు తిందట దాంతో నేను ఆ శృంగారాత్మక చిత్రంలో నటించడం లేదు బాబో ! అంటూ మొర పెట్టుకుంది.

No comments:

Post a Comment