Thursday, 30 October 2014

మహేష్ సినిమా టైటిల్ ....?


                    


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి ‘మా అక్క బంగారం’ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందా? అని దర్శకనిర్మాతలు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ సిినిమాలో మహేశ్ కు అక్కగా నదియా నటిస్తుంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ కథకు ‘మా అక్క బంగారం’ అనే టైటిల్ యాప్ట్ గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు ఈ సినిమాకు మగాడు, పరాక్రమ అనే పవర్ ఫుల్ టైటిల్స్ అనుకున్నారు.అయితే, మహేశ్ కు ఈ ఏడాది వరుసగా రెండు పరాజయాలు ఎదురవడంతో, ఎటువంటి అంచనాలు ఉండకూడదన్న ఉద్దేశంతో వీటిని పక్కనపెట్టినట్టు తెలుస్తోంది . ‘మా అక్క బంగారం’ లాంటి సాప్ట్ టైటిల్ పెడితే సినిమా మీద పెద్దగా అంచనాలు ఉండవని,  దీని వల్ల తమ మీద ఒత్తిడి తక్కువ ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారట ? శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

No comments:

Post a Comment