Thursday, 30 October 2014

పెళ్ళికి రెడీ అవుతున్న భామ పూజ.

                        


తమిళంలో పలు చిత్రాల్లో నటించిన శ్రీలంక భామ పూజ త్వరలోనే పెళ్లి చేసుకొని ఓ ఇంటిది కాబోతోంది. ఇన్నాళ్ళు కెరీర్ పరంగా ఎంతో కొంత గ్రోత్ ఉంటుందని ఆశించి నప్పటికీ కెరీర్ పరంగా తను ఆశించిన అవకాశాలు రాకపోవడంతో దానికి తోడూ తనకు బాగా సన్నిహితులైన హీరో ఆర్య ,దర్శకులు బాల కూడా తనని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేకపోవడంతో పెళ్ళికి రెడీ అయిపొయింది. శ్రీలంక కి చెందిన తన సన్నిహితుడు దీపక్ షణ్ముగం తో ఏడడుగులు వేయడానికి పచ్చజెండా ఊపింది. తమిళంలో ''జె జె '' చిత్రంతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ భామ కి ఆ తర్వాత మరికొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ పెద్దగా పేరు రాలేదు దాంతో కొన్నాళ్ళు అజ్ఞాతవాసం చేసింది. ఆ సమయంలో తన ప్రేమికుడు అయిన షణ్ముగం తో చెట్టా పట్టా లేసుకొని తిరుగుతూ సహజీవనం చేసింది. మొత్తానికి వచ్చే నెలలో అతగాడితోనే వివాహ నిశ్చితార్దం చేసుకొని డిసెంబర్ లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట .

No comments:

Post a Comment