Thursday, 30 October 2014

ఒక్కరోజులో రికార్డ్ కలక్షన్స్ కొట్టిన బాద్షా.

                                  
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ చెన్నై ఎక్ష్ ప్రెస్ సినిమా తరువాత తను  హీరోగా నటించిన చిత్రం ’హ్యాపీ న్యూ ఇయర్’. ఫరాఖాన్ దర్శకత్వాం లో రూపొందిన ఈ చిత్రం  శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి వసూళ్ల మోత మ్రోగిస్తోంది. విడుదలైన మొదటి రోజునే దాదాపు  రూ. 44కోట్లు వసూళ్లు చేసింది. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజున హిందీ వర్షన్ లో రూ. 42.62కోట్లు, తెలుగు వర్షన్ రూ. 1.43కోట్లు, తమిళ్ వర్షన్ రూ. 0.92కోట్ల వసూళ్లు సాధించినట్లు విశ్లేషకుల సమాచారమ్. ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకొనే జతకట్టింది. మరో వారం పాటు వసూళ్లు ఇలాగే కొనసాగితే బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాయడం ఖాయం. ఇప్పటికే ఈ సినిమా బాలీవుడ్ రికార్డ్ లను దుమ్ము దులిపింది.

No comments:

Post a Comment