Friday, 31 October 2014

సాయి ధరం తేజ్ తో హరీష్ శంకర్ సినిమా.

                          

 
గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ మళ్లీ సినిమాకు రెడీ అవుతున్నాడు . ఎన్టిఆర్ నటించిన  'రామయ్యా వస్తావయ్యా' సినిమా అపజయంతో కాస్త వెనకపడ్డ ఈ దర్శకుడు ఇప్పుడు మరో హిట్టు తీసి, తనని తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి మేనల్లుడు సాయి ధరం తేజ్ కథానాయకుడుగా నటిస్తాడు. ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ అమెరికాలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నవంబర్ 3న ఈ చిత్రం షూటింగును ప్రారంభిస్తారు. ఈ చిత్రం కోసం 'సుబ్రమణ్యం ఫర్ సేల్' అనే టైటిల్ గత కొంత కాలంగా ప్రచారంలో వుంది. దిల్ రాజు నిర్మించే ఈ సినిమాలో నూతన నటీనటులు  నటించనున్నారు.

No comments:

Post a Comment