Friday, 31 October 2014

హీరోగా రచయిత కుమారుడు.

                               
 
 
డబ్బింగ్ చిత్రాల ద్వారా వెన్నల కంటి అందరికి బాగా పరిచయం . అయన తనయుడు శశాంక్ కుడా రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాడు . లేటెస్ట్ గా అయన మరో తనయుడు రాకేందు మౌళి హీరోగా పరిచయం అవుతున్నాడు . ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్ తెలుగులో నిర్మాతగా పరిచయమవుతున్నాడు. క్యాపిటల్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఆయన 'మూడు ముక్కల్లో చెప్పాలంటే' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో రాకేందుమౌళి హీరోగా పరిచయమవుతున్నాడు. అదితి చెంగప్ప హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని  మధుమిత దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్ ను పూర్తి చేసుకుంది.  నవంబర్ లో పాటల చిత్రీకరణ పూర్తి చేసి, డిసెంబర్ మూడో వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ఆయన తెలిపాడు.


No comments:

Post a Comment