Thursday, 30 October 2014

బాలయ్య లయన్ అంట.

                                             


 ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా  నటిస్తున్న సినిమా షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. సత్యదేవ దర్శకుడిగా పరిచయమవుతున్నఈ  సినిమాని  రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నాడు . ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ‘గాడ్సే’, ‘వారియర్’ అనే పేర్లు షికార్లు చేశారు. అలాగే తాజాగా ‘లయన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం. గత చిత్రం ‘లెజెండ్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బాలకృష్ణ సైతం ఈ టైటిల్ కే మొగ్గు చూపవచ్చునని అందరూ అనుకుంటున్నారు. మరి ఏ టైటిల్ ఫిక్స్ అవతుందో అనేది త్వరలోనే తెలుస్తోంది .

No comments:

Post a Comment