Tuesday, 28 October 2014

ఆ రాత్రి అలియ భట్ కు ఏమి జరిగింది.

                                   


దేశంలో ప్రస్తుతం మహిళల పై అఘాయిత్యాలు జరుగునే ఉన్నాయి . మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. కానీ వారి రక్షణ కోసం ప్రయాత్నాలు మాత్రం మానటం లేదు. ఏన్నో చిత్రాలు స్త్రీల ఆత్మరక్షణకు సంబంధించినవి వచ్చినా ఒక లఘు చిత్రం మాత్రం రాలేదనే చెప్పాలి. తాజాగా ఒంటరిగా ఉన్న మహిళలు ఎంత ధైర్యంగా ఉంటే అంతటి రక్షణ పొందుతారు అనే కాన్సెప్ట్‌తో బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ చిత్రం క్వీన్‌ దర్శకుడు వికాశ్‌ బల్‌ ‘గోయింగ్‌ హోమ్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ని చేసారు. అలియా భట్‌ని ప్రధాన పాత్రలో షార్ట్‌ ఫిలింను రూపొందించారు. అర్దరాత్రివేళ ఒంటరిగా అలియా భట్‌ కారులో ప్రయాస్తుంటుంది..అయితే ఉన్నట్లుండి రోడ్డుపై కారు ఆగిపోయింది. ఒక్క నిమిషం అటుఇటూ చూసింది. ఇంతలోనే ఓ ఐదుగురు అబ్బాయిలు కారులో వస్తూ ఆమెను చూశారు. అలియా భట్‌ దీన్ని గమనించినా ఎంతమాత్రం భయపడలేదు. వాళ్లందరూ ఆమెను కోరుక్కు తినేసేలా చూస్తున్నారు. అయినా ధైర్యంగా వాళ్లని పిలిచి సమస్య చెప్పింది. వాళ్లు కూడా అర్థం చేసుకుని లిఫ్ట్‌ ఇచ్చారు. దీనితో అలియా భట్‌ హాయిగా ఇంటికి వెళ్లిపోయింది. మహిళారక్షణకు సంబంధించిన కథాంశంతో సాగే ఈ వీడియో ఐదు నిమిషాల నిడివితో ఇది రూపొందింది .

No comments:

Post a Comment