Thursday, 30 October 2014

రికార్డు స్తాయిలో ఐ బిజినెస్.

                           


సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వం లో తమిళ హీరో విక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఐ. ఈ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా ‘ఐ’ సినిమా కు సంబందించిన తెలుగు హక్కులు కొనేందుకు టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నారు. ఇప్పటివరకు రజనీకాంత్ ‘రోబో’ తెలుగు హక్కులు అత్యధికంగా 27 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. పర భాషల నుంచి తెలుగులోకి వచ్చే డబ్బింగ్ చిత్రాల్లో ఇదే రికార్డుగా ఉంది. అయితే, విక్రమ్ తాజా చిత్రం ‘ఐ’ మాత్రం ఈ రికార్డును తిరగరాసేలా ఉంది. ఇప్పటికే ‘ఐ’ నైజాం హక్కులను 10 కోట్లకు, వైజాగ్ ఏరియా హక్కులను 5 కోట్లకు, ఉభయ గోదావరి జిల్లాల హక్కులను 2.5 కోట్లకు పంపిణీదారులు కొనుగోలు చేశారని ట్రేడ్ సర్కిల్స్ అంటున్నాయి. మిగత ఏరియాలు అన్ని కలుపుకొని దాదాపు 35 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది .  ఇప్పటికే మిగత బాషలలో కుడా ఈ సినిమా బిజినెస్ భారీగానే సాగింది . మరి ఈ సినిమా దక్షిణాదిలోనే సంచలన చిత్రం గా నిలవడం ఖాయం అని తెలుస్తోంది .

No comments:

Post a Comment