Thursday, 30 October 2014

ఎన్టిఆర్ తో బొమ్మరిల్లు బాస్కర్ చిత్రం?


                    


ఇటివలే విడుదలైన ‘రభస’ చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు . ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వం లో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ఇదిలా ఉండగా ఎన్టీఆర్ దిల్ రాజు బ్యానర్ లో త్వరలోనే ఓ సినిమా చేయనున్నాడట. ఇప్పటికే కథ చర్చలు కుడా జరుగుతున్నా ఈ సినిమాకు  బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తాడని తెలిసింది. ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ తర్వాత ‘అరెంజ్’ అట్టర్ ప్లాప్ తో కనుమరుగైన భాస్కర్ ఈసారి యంగ్ టైగర్ కోసం ఓ మంచి కథ రెడీ చేసినట్టు తెలుస్తోంది . మరి ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు ఏమిటనేది త్వరలో వెల్లడి కానున్నాయి .

No comments:

Post a Comment