Sunday, 26 October 2014

ఎందుకు పనికిరాని వాడే హీరో అవుతాడట !


                   


చదువుకోకుండా జులాయి గా బలాదూర్ తిరిగే వాళ్ళే హీరో లు అవుతారని అందుకు ఉదాహరణే నేను అని అర్ధం స్పురించేలా మాట్లాడాడు అల్లు అర్జున్. హైదరా బాద్ లో ''పిల్లా నువ్వు లేని జీవితం '' ఆడియో వేడుకకి హాజరైన అల్లు అర్జున్ పై విధంగా స్పందించాడు. సాయి ధరమ్ తేజ్ కి చదువు అబ్బలేదని ,సినిమాల్లోకి రావాలని ప్రయత్నించేవాడని ,మంచి హ్యుమన్ బీయింగ్ ఉన్న వ్యక్తి సాయి కాబట్టి తప్పకుండా స్టార్ హీరోగా ఎదుగుతాడనే నమ్మకం ఉందన్నారు. నాకు చదువు అబ్బలేదు ,పవర్ స్టార్ కు కూడా చదువు అబ్బలేదు అలాగే సాయి కి కూడా చదువు అబ్బలేదు కాబట్టి సాయి కూడా పెద్ద హీరో అవుతాడని చెబుతున్న సమయంలో అల్లు అరవింద్ వారించి అలా మాట్లాడొద్దని ''ఎందుకు పనికిరాని వాడే హీరో '' అవుతాడనే మెసేజ్ వెళుతుందని జోక్యం చేసుకున్నాడు. దాంతో అల్లు అర్జున్ కొంత వెనక్కి తగ్గాడు.

No comments:

Post a Comment