Friday, 31 October 2014

‘ఒక లైలా కోసం’ - సక్సెస్‌మీట్‌


                    



నాగచైతన్య హీరోగా శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్డూడియోస్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఒక లైలా కోసం’. ఈ చిత్రం ఇటీవల విడుదలై ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరినీ ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ను బుధవారం అన్నపూర్ణ ఏడెకరాలలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాగచైతన్య, హీరోయిన్‌ పూజా హెగ్డే, దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా, సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌, నటులు సుమన్‌, సత్యం రాజేష్‌, మధునందన్‌, అమిత్‌కుమార్‌, నటీమణులు సుధ, అన్నపూర్ణ, శ్యామల,  కెమెరామెన్‌ ఐ.ఆండ్రూ, గేయరచయిత పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ ` ‘‘ఈ చిత్రాన్ని ఇంత మంచి సక్సెస్‌ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది లవ్‌స్టోరీయే కాదు, మంచి ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ మూవీగా అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. ఇలాంటి ఫీల్‌గుడ్‌ ఫామిలీ ఎంటర్‌టైనర్‌ రావాలంటే కంప్లీట్‌ ఫ్యామిలీ వుండాలి. థాంక్యూ టు ‘ఒక లైలా కోసం’ ఫ్యామిలీ. అన్నపూర్ణ స్టూడియోస్‌ 25వ చిత్రానికి ఇలాంటి ఫ్యామిలీ దొరకడం మా అదృష్టం. ఇదే ఫ్యామిలీతో త్వరలో మరో సినిమా చెయ్యాలని వుంది’’ అన్నారు.

హీరోయిన్‌ పూజా హెగ్డే మాట్లాడుతూ ` ‘‘ఒక బ్యూటీఫుల్‌ మూవీలో అన్నపూర్ణ స్టూడియోస్‌లాంటి పెద్ద బేనర్‌లో చెయ్యడం మరింత ఆనందాన్ని కలిగించింది. ఇండస్ట్రీలోని అందరి నుంచి మంచి అప్రిషియేషన్‌ వచ్చింది. ఇప్పటికి ఈ సినిమాని ఆరు సార్లు చూశాను. ఈ సినిమా షూటింగ్‌ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తూ కంప్లీట్‌ చేశారు. నాగచైతన్య మంచి కోస్టార్‌. అతనితో నటించడం చాలా ఎక్సైట్‌ అయ్యాను’’ అని అన్నారు. దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా మాట్లాడుతూ ` ‘‘ఈ సినిమాని పెద్ద హిట్‌ చేసిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ముందుగా నాగార్జునగారికి, చైతుకి థాంక్స్‌ చెప్తున్నాను. ఈరోజుల్లో ఐటమ్‌ సాంగ్‌ లేకుండా, డబుల్‌ మీనింగ్‌ డైలాగులు లేకుండా హోల్‌ ఫ్యామిలీ చూడగలిగే మంచి స్క్రిప్ట్‌ చెప్పగానే చాలా బాగుంది విజయ్‌ మనం చేస్తున్నాం అని ధైర్యంగా ముందుకొచ్చారు. ఈ సక్సెస్‌కి కారణమైన యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. నాకు ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో కార్తీక్‌లా ప్రేమించే అబ్బాయి కావాలని మెసేజ్‌లు వస్తున్నాయి. ఆడియన్స్‌కి ఈ సినిమా ఇంత దగ్గరగా వెళ్ళినందుకు చాలా ఆనందంగా వుందని ''అన్నారు.

No comments:

Post a Comment