Tuesday, 28 October 2014

కార్తికేయ దర్శకుడికి ఆఫర్ల వెల్లువ .

               


 నిఖిల్ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు చందు మొండేటి. ''కార్తికేయ '' చిత్రం ద్వారా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కి అప్పుడే ఆఫర్ల వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కార్తికేయ ని సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన చందు ప్రతిభ పై పలువురు హీరోలకు నమ్మకం కలగడంతో ఎలాగైనా అతడితో సినిమా చేయాలనీ చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆ దర్శకుడిని అభినందిస్తూ మాటలో మాటగా మనం కలిసి సినిమా చేద్దామని అంటున్నారట ! ఇప్పుడు ఆ జాబితాలో కింగ్ నాగార్జున కూడా చేరాడు. నాగార్జున కొత్త దర్శకులను ప్రతిభ ఉన్నవాళ్ళను గుర్తించడంలో నెంబర్ వన్ అన్న విషయం తెలిసిందే . అందుకే చందు ని ఎంకరేజ్ చేయాలనీ భావించాడట నాగ్ . ఇక సునీల్ ,నాని లాంటి హీరోలు సైతం చందు తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో చందు కి ఆఫర్ల వెల్లువ ఎక్కువయ్యింది.

No comments:

Post a Comment