నందమూరి నట వారసుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను వెండితెరకు హీరోగా పరిచయం చేసే అవకాశం తనకు కలగాలనేది తన కోరికని ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి చెప్పారు. అందుకే, 'రానే వచ్చాడయ్యా ఆ రామయ్యా' అనే టైటిల్ని రిజిస్టర్ చేశానని ఆయన తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయనీ విషయాన్ని వెల్లడించారు. తాను టీవీలో వచ్చే సినిమా పాటలని బాగా పరిశీలిస్తాననీ, అలా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా పాట వింటుండగా ఈ 'రానే వచ్చాడయ్యా ఆ రామయ్య' టైటిల్ మోక్షజ్ఞకు బాగా సూటవుతుందని అనిపించిందనీ సాయి చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా విషయాలు బాలయ్య చెబుతారని ఆయన అన్నారు. గత కొన్నాళ్లుగా వరుస విజయాలు సాధిస్తున్న సాయి కొర్రపాటి మొత్తానికి బాలయ్య తనయుడిని హీరోగా పరిచయం చేసే సువర్ణావకాశాన్నిదక్కించుకున్నాడు మరి ?
Thursday, 30 October 2014
బాలయ్య వారసుడి కోసమే ఆ టైటిల్.

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment