Tuesday, 28 October 2014

ఆ దర్శకుడికే షరతులు పెట్టిన నిత్యా.

            


అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హాట్ హాట్ అందాలా భామ నిత్య మీనన్ ఈ మద్య సరైన సినిమాలు లేక కాస్త వెనక పడిపోయింది . అయితే ఇటివలే ఓ మంచి అవకాశం రావడం తో ఎగిరి గంతెయకపోగా ... షరతులు పట్టిందట ? ఇంతకీ విషయం ఏమిటంటే ఈ భామ  తన పాత్రకు, కథకు ప్రాముఖ్యత నిస్తుంది. ఆతర్వాత రెమ్యూనిరేషన్ కు. ఇవన్నీ పూర్తైతే కానీ దర్శకుడి గురించి ఆలోచించదు. అందుకే ఆమె చాలా తక్కువగా తెలుగు సినిమాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి నిత్యా మీనన్ పరీక్షపెట్టింది. తన పాత్ర, కథ , రెమ్యునిరేషన్ ఇవ్వన్నీ నచ్చాకే అల్లు అర్జున్ సినిమాలో నటించేందుకు ఓకే అందట. ఈ మూవీలో నటించటానికి నిత్యామీనన్, దాదాపు 70 లక్షల రూపాయల వరకూ డిమాండ్ చేసిందని టాలీవుడ్ లో టాక్. మరి ఈమె పరీక్షకు త్రివిక్రమ్ ఎలా రెస్పాన్స్ అయ్యాడో చూడాలి ?

No comments:

Post a Comment