ప్రస్తుతం కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా జోరుమీదున్న హన్సిక కోరిక ఇప్పట్లో తీరేలా లేదు. తమిళ స్టార్ హీరో అజిత్ సరసన నటించాలనేది ఆమె చిరకాల కోరిక. ఈ విషయాన్ని ఇటీవలే మీడియా ముఖంగా కూడా ప్రకటించింది. దాంతో, తన తదుపరి సినిమాలో ఈ ముద్దుగుమ్మకు అవకాశం ఇవ్వడానికి అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తమిళ మీడియాలో వార్తలొచ్చాయి. ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ స్టార్ హీరో , దీని తర్వాత శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సివుంది. అందులో కథానాయికగా ఆమెను తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. అయితే, తాజాగా దర్శకుడు శివ ఈ వార్తలని ఖండించాడు. ఆ సినిమాలో హన్సిక నటించడం లేదనీ, అయినా కథానాయికను ఇంకా ఎంపిక చేయలేదనీ చెప్పాడు. దీంతో పాపం, ఈ బొద్దుగుమ్మ ఆశలు ఒక్కసారిగా చల్లారిపోయాయి. మరి ఈమె కోరికను ఆ హీరో ఎప్పుడు తీరుస్తాడో చూడాలి .
Thursday, 30 October 2014
హన్సిక చిరకాల కోరిక.

Labels:
KOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment