బాలీవుడ్ షోవ్యూన్ రాజ్‌కపూర్ సూపర్‌హిట్ చిత్రం ‘ఆవారా’ను రీమేక్ చేయడమా..? అలాంటి ఆలోచనే తమ కుటుంబ సభ్యులెవరికీ లేదని చెబుతున్నాడు రణధీర్ కపూర్. రిషికపూర్, రణబీర్ కపూర్‌లతో ‘ఆవారా’ రీమేక్ చేయల్సిందిగా చాలామంది అడుగుతున్నారని, అయితే, పృథ్వీరాజ్ కపూర్, రాజ్‌కపూర్‌ల పాత్రలకు న్యాయం చేసే నటులెవరూ లేరని అంటున్నాడు.
‘ఆవారా’ ఘన విజయనికి పాటలు కూడా కారణమేనని, శంకర్-జైకిషన్‌ల వంటి సంగీత దర్శకులు, శైలేంద్ర వంటి గీత రచయితలు దొరకడం నేటి రోజుల్లో అసాధ్యమని చెబుతున్నాడు.
No comments:
Post a Comment