సూపర్‌స్టార్ రజనీకాంత్ వసూళ్లను ఇళయదళపతి అధిగమించారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో వాడివేడిగా జరుగుతున్న చర్చ ఇదే. నటుడు విజయ్ నటించిన తాజా చిత్రం కత్తి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్. ఈ చిత్రం తెరపైకి వస్తుందా? రాదా? అంటూ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఈ చిత్రం పలు అవరోధాలను ఎదుర్కొని నిర్ణయించిన తేదీకే దీపావళి రోజు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రం వసూళ్ల పరంగా రికార్డులు బద్దలు కొడుతోందని ఆ చిత్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ వెల్లడించారు. కత్తి చిత్రం విడుదలైన తొలి రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.26 కోట్ల 80 లక్షలు వసూలు చేసిందని దర్శకుడు పేర్కొన్నారు.
మన దేశంలో రూ.16 కోట్ల 45 లక్షలు, విదేశాలలో ఏడు కోట్ల 35 లక్షలు వసూలు చేసిందని మురగదాస్ ప్రకటించారు. అదే విధంగా దక్షిణాదిలోనే ఏ చిత్రమూ ఇంత వసూలు చేయలేదని చెప్పారు. తమిళ చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రజనీకాంత్ ఎందిరన్ చిత్రం నమోదైందన్నారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని అజిత్ నటించిన ఆరంభం చిత్రం దక్కించుకుందన్నారు. తాజాగా ఆ రెండు చిత్రాలను కత్తి చిత్రం అధిగమించిందనే అభిప్రాయాన్ని ఎఆర్ మురుగదాస్ వ్యక్తం చేశారు. అలాగే నటుడు విజయ్ నటించిన చిత్రాలన్నింటికంటే మంచి కథాంశం ఉన్న చిత్రంగా కత్తి మరో ఘనతను చాటుకుంటోంది.
No comments:
Post a Comment