Sunday, 26 October 2014

ప్రియమణి, ఆర్పి ల అదృష్టపరీక్ష!

                        


టాలీవుడ్‌లో  సంగీత దర్శకుడిగా  తన ప్రస్థానం మొదలు పెట్టిన ఆర్పీ పట్నాయక్  మ్యూజిక్‌లో తనమార్క్‌ చూపించిన తర్వాత   నటుడిగా మారారు. వెండితెరపై తన అభిరుచి చూపేందుకు  డైరెక్టర్‌గా కూడా మారాడు.  కొన్ని సంవత్సరాల క్రితం యూత్ని ఎవరిని కదిపినా తమ అభిమాన సంగీత దర్శకుడు ఆర్పి అని చెప్పేవారు. ఆ తరువాత  ఆర్పి పట్నాయక్ దర్శకుడిగా, నటుడిగా రాణించడానికి చాలా ప్రయత్నించాడు.

మల్టీపుల్ టాలెంటెడ్‌  ఆర్పి నటించిన బ్రోకర్ లాంటి సినిమాలు విమర్శకుల దగ్గర నుంచి ప్రశంసలు తెచ్చి పెట్టాయి కాని కాసులు కురిపించ లేదు. దాంతో విసిగి పోయిన ఆర్పి తన అదృష్టాన్ని శాండిల్‌వుడ్‌లో పరీక్షించుకోవడానికి సిద్ద పడుతున్నాడు.  కన్నడంలో ఆర్పీ 30 సినిమాలకు స్వరాలందించారు.  కన్నడ ప్రేక్షకులకు నచ్చే రీతిలో కథను రూపొందించారు. 'వ్యూహ' పేరుతో నిర్మించే ఈ చిత్రానికి తనే దర్శకత్వం వహిస్తున్నారు. నటిస్తున్నారు.

 ప్రస్తుతం ఇటు టాలీవుడ్లోను, అటు కోలీవుడ్లోను అవకాశాలు లేని హీరోయిన్ ప్రియమణిని 'వ్యూహ'లో పోలీసు ఆఫీసర్గా చూపించబోతున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు అందుకున్నా ఆ భామకు అదృష్టం కలిసిరాలేదు. రాష్ట్ర స్థాయిలో నంది అవార్డును అందుకున్నా ఆర్పీకి పెద్దగా అవకాశాలు లేవు. అటువంటి ఈ ఇద్దరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.  కన్నడంలో చేస్తున్నఈ ప్రయోగం విజయవంతం అయితే, ఈ ఇద్దరికీ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది.

No comments:

Post a Comment