Saturday, 27 December 2014

సంక్రాంతికి ముందే ‘గోపాల గోపాల’ సందడి

 Gopala-Gopala2

విక్టరీ వెంకటేష్‌, పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కలయికలో తెరకెక్కుతున్న ‘గోపాల గోపాల’ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తామని గతంలో నిర్మాతలు ప్రకటించారు. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఓ ఐదు రోజుల ముందే గోపాలుడు థియేటర్లలో సందడి చేయనున్నాడు. జనవరి 9న సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పవన్, వెంకీ అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చేస్తుంది.
కిషోర్ పార్దసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మోడరన్ శ్రీకృష్ణుడిగా నటిస్తున్నారు. దేవుడిపై కేసు వేసే వ్యక్తిగా నాస్తికుడి పాత్రలో వెంకటేష్ కనిపిస్తారు. వెంకీ సరసన శ్రియ హీరోయిన్ గా నటించింది. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. త్వరలో ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు. కైలాష్ ఖేర్ ఈ సినిమాలో ప్రత్యేక గీతం ఆలపించారు.

No comments:

Post a Comment