
చాలా మంది కమెడియన్ లు హీరోలుగా మారిన సంగతి తెలిసిందే . లేటెస్ట్ గా తమిళ హాస్యనటుడు సంతానం కుడా హీరోగా మారిన సంగతి తెలిసిందే . అయితే ఇప్పుడు అతగాడు చాలా బిజీ అయ్యాడు . ఇటీవల తాను హీరోగా నటించిన 'వల్లవనుకు పుల్లుమ్ ఆయుధమ్' (తెలుగు 'మర్యాదరామన్న'కు రీమేక్) పెద్ద హిట్టవడంతో అతనికి అభిమానులు కూడా బాగా పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రొమాంటిక్-కామెడీతో తెరకెక్కే చిత్రంలో తను హీరోగా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో ఆయన సరసన ఆశ్నా జవేరీ, అఖిల కిషోర్ హీరోయిన్లుగా నటిస్తారు. అలాగే మరికొంత మంది ప్యాడింగ్ ఆర్టిస్టులుంటారు అంటూ నిర్మాతలు ప్రకటించారు. దీనికి దర్శక ద్వయం మురుగ -ఆనంద్ దర్శకత్వం వహిస్తారు.
No comments:
Post a Comment