షాహిద్ కపూర్ నటించిన 'హైదర్' సినిమాకు రోమ్ అవార్డు లభించింది. 9వ రోమ్ ఫిలిమ్ ఫెస్టివల్ లో పీపుల్స్ ఛాయిస్ అవార్డు దక్కించుకుంది. తమ సినిమా ప్రదర్శితమైన మొదటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనే అవార్డు గెల్చుకోవడం పట్ల షాహిద్ కపూర్, శ్రద్ధాకపూర్ సంతోషం వ్యక్తం చేశారు.
రోమ్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రధాన విభాగంలో అవార్డు గెల్చుకున్న తొలి చిత్రం 'హైదర్' అని శ్రద్ధాకపూర్ ట్వీట్ చేసింది. తమ సినిమాకు ఈ అవార్డు దక్కినందుకు గర్వంగా ఉందని పేర్కొంది. అక్టోబర్ 2న విడుదలైన 'హైదర్' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. షేక్‌స్పియర్ విషాదాంత నాటకం 'హామ్లెట్' ఆధారంగా విశాల్ భరద్వాజ్ 'హైదర్' చిత్రాన్ని తెరకెక్కించారు.
No comments:
Post a Comment