
తెలుగు ప్రేక్షకులు ఎన్నో రోజులనుండి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. తెలుగు చలన చిత్ర రంగంలో క్రేజీ చిత్రంగా పేరు తెచ్చుకున్న భారీ చిత్రం ''గోపాల గోపాల '' ఫస్ట్ లుక్ ని చూసి పవన్ -వెంకీ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన ''ఓ మై గాడ్ '' చిత్రానికిది రీమేక్ అన్న విషయం తెలిసిందే . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భగవంతుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భక్తుడిగా దేవుడిపై కేసు వేసే పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడు. విడుదలైన మోషన్ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు -శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ క్రేజీ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
No comments:
Post a Comment