
లవర్ బాయ్ గా ఎన్ని రోజులు నేట్టుకోస్తాం యాక్షన్ హీరోగా మారిపోతే ఒకే ఒక సినిమాతో ఫేట్ మారుతుందని భావించిన ఆది సిక్స్ ప్యాక్ తో బరిలోకి దిగి మరీ దెబ్బ తిన్నాడు. దాదాపు 8నెలలు కస్టపడి సిక్స్ ప్యాక్ చేసి కండలు చూపించినప్పటికీ ప్రేక్షకులు మాకోద్దుర బాబూ నీ సిక్స్ ప్యాక్ అంటూ తిప్పి కొట్టారు. ఆది హీరోగా తెరకెక్కిన ''రఫ్ '' చిత్రం రిలీజ్ అయ్యింది. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చిత్రాలు విజయం సాధిస్తున్నాయి కాబట్టి మా రఫ్ కూడా విజయం సాధిస్తుంది అని సెంటిమెంట్ గా భావించిన హీరోకి రఫ్ రఫ్ఫాడించక పోవడంతో ఖంగుతిన్నాడు. కథ కథనం లేకుండా సిక్స్ ప్యాక్ లు ,యాక్షన్ సీక్వెన్స్ చేస్తే ఇలాంటి రిజల్టే ఉంటుందని మరోసారి రుజువు చేసింది ఆది సినిమా .
No comments:
Post a Comment