Saturday, 29 November 2014

2000వేల థియేటర్ లలో రిలీజ్ కానున్న రజనీ "లింగా".

                     



సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బహుబాషా చిత్రం ''లింగా '' డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్ లలో భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత రాక్ లైన్ వెంకటేష్. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు. రజనీ సరసన అందాల ముద్దుగుమ్మలు అనుష్క ,సోనాక్షి సిన్హా లు నటించారు. ఇక జగపతి బాబు విలన్ గా నటించారు. రజనీ తో ఇంతకుముందు ప్రాణ స్నేహితుడిగా నటించిన జగపతి ఈసారి విలన్ గా నటించాడు. కే ఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ఈ చిత్రం రిలీజ్ కానుంది

No comments:

Post a Comment