Friday, 31 October 2014

రూమర్ల ను ఖండించిన షీలా.

                                           

 తనపై వస్తున్న పుకార్లను ఖండిస్తోంది హీరోయిన్ షీలా . అగ్ర నిర్మాత దిల్ రాజు తో తను లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు రావడంతో అవన్నీ వట్టి రూమర్లేనని అంటోంది. తనకు దిల్ రాజు ఫోన్ నెంబర్ కూడా తెలియదని అతడిని ఒకసారి మాత్రమే కలిసానని కానీ మామధ్య ఏదో ఉందని ఇలా వార్తలు గుప్పుమనడం బాధ అనిపించిందని అన్నారు. ఐతే గత మూడు సంవత్సరాలుగా సరైన స్క్రిప్ట్ రాకపోవడంతో సినిమాల్లో నటించడం లేదని ఇక గత సంవత్సర కాలంగా యు కే లో ఉంటున్నానని హైదరాబాద్ రాక మూడేళ్ళు అవుతోందని అంటోంది. నాకు సరిపడా స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా నటిస్తానని కూడా చెబుతోంది షీలా.

No comments:

Post a Comment