బాలీవుడ్‑
సినిమాల్లో తాను ఐటెం సాంగులు
చేయడానికి కూడా సిద్ధమేనని చెబుతోంది
జాక్వెలిన్ ఫెర్నాండెజ్. బాలీవుడ్ సినిమాలలో పాటలు, డాన్సులు చాలా ముఖ్యమైన భాగమని,
అందుకే.. ఏదైనా సినిమాలో తనకు
ఐటెం సాంగ్ వస్తే తప్పకుండా
చేస్తానని ఈ శ్రీలంక చిన్నది
చెప్పింది. ప్రస్తుతం కిక్ సినిమా ప్రమోషన్‑లో మహా బిజీగా
ఉన్న జాక్వెలిన్.. ఎందుకోగానీ, కత్రినా కైఫ్‑ను పొగడ్తల్లో
ముంచెత్తింది.
కత్రినా కైఫ్ భలే కష్టపడి పనిచేస్తుందని, అందుకే ఇన్ని సంవత్సరాల నుంచి ఆమె బాలీవుడ్‑ను ఏలుతోందని జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెగ పొగిడేసింది. కిక్ సినిమాలో హీరో సల్మాన్‑ఖాన్‑కు మాజీ ప్రేయసి అయిన కత్రినాను పొగిడితే తనకు ఉపయోగం ఉంటుందని భావించిందో ఏమో గానీ.. ఈ పని మొదలుపెట్టింది. కష్టపడకుండా ఏమీ సాధించలేమని, కత్రినా ఇన్ని సంవత్సరాల నుంచి బాగా కష్టపడుతుండటం వల్లే ఇన్నేళ్ల నుంచి అగ్రస్థానంలో కొనసాగుతోందని తెలిపింది.

No comments:
Post a Comment